కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా
NEWS Jan 07,2025 03:20 am
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చట్ట సభల సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు రావడంతో లిబరల్ పార్టీ నాయకుడిగా ఉన్న ట్రూడో ఇక తను తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు ఆర్థిక మంత్రిగా ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ విధానపరమైన విభేదాల కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. ట్రూడో పూర్తిగా భారత్ వ్యతిరేక విధానాలను అవలంభించారు.