ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు
NEWS Jan 06,2025 04:31 pm
బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వ్యాపార లావాదేవీలు చేస్తున్న స్థలంలో మండల రెవెన్యూ సిబ్బంది గ్రామ వీఆర్వో తులసి ఆదేశాలతో సోమవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ లక్ష్మీ తెలిపారు. మండల పరిధిలో ఉన్న వివిధ ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని అన్యాక్రాంతం కాకుండా రక్షించడానికి కృషి చేస్తామని తెలిపారు.