దేశ, హిందూ ధర్మ రక్షణయే త్రిశూల్ దీక్ష లక్ష్యం
NEWS Jan 06,2025 03:31 pm
దేశ రక్షణ, హిందూ ధర్మ రక్షణ త్రిశూల్ దీక్ష ధ్యేయమని పలువురు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిశూల్ దీక్ష కార్యక్రమంలో పలువురు పాల్గొని మాట్లాడారు. దేశ, ధర్మ రక్షణ కోసం పాటుపడుతామని ప్రతిజ్ఞ చేశారు. త్రిశూల్ దీక్ష ప్రతిజ్ఞ అనంతరం శౌర్య జాగరణ యాత్ర పద సంచలన నిర్వహించారు. అధిక సంఖ్యలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.