ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదు
NEWS Jan 06,2025 03:28 pm
కొడిమ్యాలకు చెందిన రాచకొండ రాజేందర్ కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కుమార్ పై సోమవారం జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసారు. రెండు రోజుల క్రితం బైక్ ఆపకుండా వెళ్లినందుకు ఇంటికి వచ్చి మరి కొట్టారని బాధితుడు కంప్లెంట్లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ..ఎస్ఐ సందీప్ కుమార్, కానిస్టేబుల్ రాకేశ్ చెవిపై కొట్టారని, కుడి చెవి వినిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.