స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన క్లాస్ మేట్స్
NEWS Jan 06,2025 03:29 pm
మల్లాపూర్ మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రామ నర్సయ్య కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. 2000-2001 SSC బ్యాచ్ తరఫున రామ నర్సయ్య కుటుంబానికి రూ.58000 ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించారు. భవిష్యత్తులో వారి ముగ్గురి పిల్లల చదువుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రామ నర్సయ్య మృతితో ఒక మంచి స్నేహితుడిని కోల్పోయామని భావోద్వేగానికి లోనయ్యారు.