Logo
Download our app
ఎరువుల దుకాణాల తనిఖీ
NEWS   Jan 06,2025 02:58 pm
ఇబ్రహీంపట్నం, యామాపూర్ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను, సొసైటీలను మండల వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను, ఈపిఓఎస్ మిషిన్ లోని ఎరువుల నిల్వలతో పరిశీలించారు. ఇప్పటివరకు సరఫరా చేసిన ఎరువుల వివరాలు, రైతుల వారిగా విక్రయించిన ఎరువుల వివరాలను తనిఖీ చేశారు. నకిలీ ఎరువులను, పురుగుల మందులను విక్రయిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source