అప్పుల వల్ల 6 గ్యారెంటీలు ఆలస్యం
NEWS Jan 05,2025 01:00 pm
గత వైపీసీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారంటీలు ఆలస్యం అయ్యాయని అన్నారు మంత్రి నారా లోకేష్. వాళ్లు చేసిన బకాయిలను తాము చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రతి నెలా రూ. 4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం నడుస్తోందన్నారు. ఇచ్చిన హామీలలో 2 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పారు. మరో రెండింటి అమలుకు సైతం డేట్స్ కూడా ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నింటిని అమలు చేసి తీరుతామన్నారు.