కామన్ మెనూపై పొన్నం ఆరా
NEWS Jan 05,2025 12:21 pm
హుస్నాబాద్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. పెంచిన డైట్ చార్జీలు అమలవుతున్న తర్వాత కామన్ మెనూపై ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. లక్ష్య సాధన కోసం ఎలా కృషి చేయాలో.. ఎలా విజయం సాధించాలో విద్యార్థినులకు సూచనలు చేశారు. ఇబ్బందులు ఎదురైనా సరే నిధులు మంజూరు చేశామన్నారు.