సినిమాలపై అనంత శ్రీరామ్ కామెంట్స్
NEWS Jan 05,2025 12:14 pm
హిందూ ధర్మానికి కళంకం కలిగించేలా సినిమాలు వస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్. విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ శంఖారావం పేరుతో సభను చేపట్టారు. ఈ సందర్బంగా నిప్పులు చెరిగారు సినీ రంగంపై. తెలుగు వారు సిగ్గుపడేలా సినిమాలు తీస్తున్నందుకు తాను సినీ రంగం తరపున క్షమాపణలు చెబుతున్నానని బహిరంగంగా ప్రకటించారు.