బాబుపై భగ్గుమన్న చింతా మోహన్
NEWS Jan 05,2025 11:54 am
చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ ఎంపీ చింతా మోహన్. దళితుల జోలికి వస్తే బాబుకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టుపై రోజు రోజుకు అంచనాలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. వీటిలో ఎవరికి ఎంతెంత వాటాలు దక్కాయో చెప్పాలన్నారు. బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడుతోందన్నారు.