సర్కార్ పై కేటీఆర్ ఫైర్
NEWS Jan 05,2025 11:44 am
రైతులను కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఏడాదిగా కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పుతోందన్నారు . రైతులకు రూ.15 వేలు అని చెప్పి రూ.12 వేలే ఇస్తామనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రైతు భరోసా పేరుతో మరోసారి మోసం చేశారని ఆరోపించారు.. కౌలు రైతులకు, భూ యజమానులకు ఎన్నికల సందర్బంగా రాహుల్ గాంధీతో డబ్బులు ఇస్తామని చెప్పించారని, కానీ మాట తప్పారని ఆరోపించారు.