Logo
Download our app
నిజాం షుగర్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం ఒకే
NEWS   Jan 05,2025 07:19 am
చెరకు రైతుల చిరకాల వాంఛ అయిన నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ వెల్లడించారు. నిజాం షుగర్స్ ను పునః ప్రారంభించే చర్యల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో రైతులతో అవగాహనా సమావేశం నిర్వహించారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. రైతులు చెరకు పంట సాగుకి ముందుకు రావాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source