Logo
Download our app
ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తాం
NEWS   Jan 05,2025 06:11 am
కోరుట్ల: నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. బీఎన్ రావు అన్నారు. కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ వైద్యులు అనుప్ రావు, మహదేవ్, మాజీ జెడ్పిటిసి నాగం భూమయ్య పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source