నారుకు ట్యాంకర్‌తో నీరు
NEWS Jan 04,2025 05:16 pm
నాగిరెడ్డి పేట్ మండలం పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. నారు ఎండుతుండడంతో ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి అందిస్తున్నారు.గోపాల్‌పేటకు చెందిన లక్ష్మయ్య అనే రైతు పోచారం ప్రధాన కాలువ కింద వరి వేసేందుకు ఇప్పటికే నారు పోశాడు. అయితే ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేయకపోవడంతో నారు ఎండిపోతోంది. దీంతో ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నాడు. కాగా ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేయనున్నారు. దీంతో తమ సాగునీటి కష్టాలు తీరుతాయని రైతు లక్ష్మయ్య పేర్కొన్నాడు.