Logo
Download our app
ఉపాధ్యాయులు నూతన తరం సృష్టికర్తలు
NEWS   Jan 04,2025 05:16 pm
ఉపాధ్యాయులు నూతనతరం సృష్టికర్తలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఉప్పల్‌వాయి పాఠశాలలో సావిత్రీబాయి పూలె జయంతి సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సావిత్రీబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంఈవో నిట్టు ఆనంద్‌ రావు, టీపీటీఎఫ్‌ కామారెడ్డి అధ్యక్షుడు చింతల లింగం ఉన్నారు
⚠️ You are not allowed to copy content or view source