విద్యార్థులకు భోజన పథకం వరం
NEWS Jan 04,2025 10:42 am
కూటమి ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో ప్రవేశ పెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం విద్యార్థులకు ఓ వరం లాంటిదన్నారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్. బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ పథకాన్ని ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని కావాలని నాశనం చేసిందంటూ ఆరోపించారు . సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు.