జగిత్యాల పట్టణంలో రహదారులు అభివృద్ధి
NEWS Jan 04,2025 06:23 am
జగిత్యాల పట్టణంలో అన్ని వైపులా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తా అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 32వ వార్డులో 20 లక్షల నిధులతో, 33వ వార్డులో 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్ కోరే గంగమల్లు, దయాల శంకర్ పాల్గొన్నారు.