లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ ఎంఎల్ఏ
NEWS Jan 04,2025 06:22 am
ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సతీమణి సరోజనమ్మ. ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. స్వామి వారి చిత్ర పటంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు మాజీ ఎమ్మెల్యే.