జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
NEWS Jan 04,2025 05:09 am
ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం సదుపాయాన్ని కల్పించింది సర్కార్. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యార్థులకు మేలు చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో ఇస్కాన్ కు చెందిన అక్షయ పాత్ర సంస్థ భోజనాలు సమకూరుస్తోంది. 2014-19 కాలంలో బాబు ప్రభుత్వం ఉచిత భోజన పథకం ఏర్పాటు చేసింది.