మోసం చంద్రబాబు నైజం
NEWS Jan 04,2025 04:55 am
మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మోసం చంద్రబాబు నైజం అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాడని, సొల్లు కబుర్లు చెప్పడం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు. అన్ని వర్గాలకు ఇస్తానన్న హామీలు ఏమయ్యాయంటూ నిలదీశారు. ప్రజా సంక్షేమం కోసం తాము ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను కావాలని నిలపుదల చేశారంటూ ఆరోపించారు. ఆరు నెలల కూటమి పాలన గాడి తప్పిందన్నారు.