అక్షర జ్ఞానం అందించిన మహానీయురాలు
NEWS Jan 03,2025 06:19 pm
మేడిపెల్లి: సావిత్రిభాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఉమ్మడి మేడిపెల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉమ్మడి రవి హర్షం వ్యక్తం చేశారు. దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా అణగారిన మహిళలకు అక్షర జ్ఞానం అందించిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆ మహానీయురాలి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మహిళలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.