Logo
Download our app
దళితసంఘాల ఐక్యవేదిక సమావేశం
NEWS   Jan 03,2025 06:21 pm
బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ అధికార ప్రతినిధిగా ఆసాది మధు, పట్టణ ఉపాధ్యక్షులుగా దాసరి భానయ్య నియామకం చేశారు. వారికి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కుంభాల రాజేష్ ముఖ్య సలహాదారులు మల్లారపు చినరాజం చేతుల మీదుగా నియామక పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో రత్నం ఐలయ్య, గోడిసెల శ్రీహరి, మద్దేల గోపి, గొడిసెల చంద్ర మోగిళి, పైడిమల్ల చంద్ర శేఖర్, డోలే సురేష్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source