Logo
Download our app
మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్
NEWS   Jan 03,2025 11:34 am
మెట్‌ప‌ల్లి: నర్సరీలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 50 పండ్ల, పూల మొక్కలను నాటిన‌ట్టు తెలిపారు. నర్సరీ విస్తీర్ణం మూడున్నర ఎకరంలో పూల, పండ్ల మొక్కలను పెంచుతామ‌ని తెలిపారు. నేషనల్ హైవే డివైడర్ పైన పూల మొక్కలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ పచ్చదనంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటాలని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source