సావిత్రి బాయి పూలే జయంతి
NEWS Jan 03,2025 04:14 am
అణగారిన వర్గాలకు కూడా చదువు అవసరమని గుర్తించిన మహోన్నత వ్యక్తి జ్యోతి బా పూలే సతీమణి సావిత్రి బాయి పూలే. జనవరి 3 ఆమె జయంతి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. భారతీయ సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, ఉపాధ్యాయని, రచయిత్రి సావిత్రిబాయి పూలె. ఆమె బహుజనుల గొంతుకగా నిలిచారు. సర్వస్వం ధారపోశారు.