విజయవాడ సీపీ పనితీరు భేష్
NEWS Jan 03,2025 03:25 am
హోం మంత్రి వంగలపూడి అనిత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును ప్రశంసలతో ముంచెత్తారు. తను అద్బుతంగా పని చేస్తున్నాడని అన్నారు. భవానీ దీక్షల సందర్బంగా చేసిన భద్రతా ఏర్పాట్లు బాగున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా సైబర్ సిటిజన్ యాప్ పై అవగాహన కల్పిస్తున్న తీరు అద్భుతమన్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం అంటూ ప్రచారం చేస్తున్నారు సీపీ.