మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ పై బాబు ఆరా
NEWS Jan 03,2025 02:12 am
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. శాఖల వారీగా సమీక్ష చేపట్టిన ఆయన మంత్రుల పనితీరుపై ఆరా తీశారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. బాధ్యత కలిగిన మీరే నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలలైనా ఇప్పటి వరకు ప్రోగ్రెస్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదంటూ కొందరు మంత్రులపై మండిపడ్డారు. ఇలా చేస్తే ఊరుకోనన్నారు.