ఏపీలో రిలయన్స్ 65 వేల కోట్ల ఇన్వెస్ట్
NEWS Jan 03,2025 01:47 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీపి కబురు చెప్పింది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. రూ. 65 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్ర వ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ముందుకు వచ్చిందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాంట్స్ కోసం కావాల్సిన భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.