దివాకర్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
NEWS Jan 02,2025 03:29 am
దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు దగ్దం అయ్యింది. ఈ అనంతపురంలో చోటు చేసుకుంది. ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ వద్ద 11కేవి విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తెగి పోయి బస్సు మీద పడడంతో పూర్తిగా కాలి పోయింది. మంటలు ఎగసి పడడంతో చుట్టు పక్కల జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లలోంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.