దుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు
NEWS Jan 01,2025 03:59 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు హోం మంత్రి వంగలపూడి అనిత విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ , పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు.