ప్రభుత్వ హాస్టళ్లపై సర్కార్ కీలక నిర్ణయం
NEWS Jan 01,2025 03:49 pm
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఆధీనంలోని అన్ని హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు రాత్రి పూట నిద్ర చేయాలని, వసతుల కల్పనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.