Logo
Download our app
కామారెడ్డి డీఎస్పీగా చైతన్యరెడ్డి బాధ్యతలు
NEWS   Jan 01,2025 09:40 am
కామారెడ్డి: కామారెడ్డి డీఎస్పీగా జిల్లా అదనపు ఎస్పీగా వచ్చిన చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డివిజన్లోని సీఐలు, ఎస్సైలతో ఆమె సమావేశమయ్యారు. పెండింగ్ కేసుల వివరాలు, పోలీస్ అధికారుల పనితీరు, కొత్త ఏడాదిలో చేయాల్సిన పనుల గురించి చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన డీఎస్పీ నాగేశ్వర్ రావు జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source