14న ఆస్ట్రేలియా సీఎం టూర్
NEWS Jan 01,2025 06:35 am
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 14న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, స్పోర్ట్స్ చైర్మన్ కూడా వెళతారు. రెండు రోజుల పాటు జరిగే ఈ టూర్ లో క్వీన్ లాండ్ లోని స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శిస్తారు. అక్కడి నుండి 16న సింగపూర్ కు వెళతారు. క్రీడా ప్రాంగణాలను పరిశీలిస్తారు. తెలంగాణలో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నారు.