న్యాయ్ పాదయాత్ర ఆగ్రా జిల్లా ఇన్‌చార్జిగా నీలం రమేశ్
NEWS Jan 01,2025 06:44 am
కామారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న కిసాన్ మజ్దూర్ సమ్మాన్ న్యాయ్ పాదయాత్ర ఆగ్రా జిల్లా ఇన్‌చార్జిగా నీలం రమేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ అఖిలేష్ శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన నీలం రమేశ్ గతంలో వైఎస్సార్ టీపీలో పని చేశారు. ప్రస్తుతం షర్మిలతో పాటు ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పని చేశారు.