ఏపీని దేశంలోనే నెంబర్ వన్ చేస్తాం
NEWS Jan 01,2025 05:28 am
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్. తమ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం వెల్లి విరిసేలా ప్రయత్నం చేస్తామన్నారు. ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ముందుకే వెళతామన్నారు.