కొత్త ఏడాది వెలుగులకు రహదారి
NEWS Jan 01,2025 05:20 am
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సరం సందర్బంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు సంతోషంగా, ఆయురారోగ్యంతో ఉండాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని తెలిపారు . ప్రతి ఇల్లు సుఖ శాంతులతో వెల్లి విరియాలని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలషించారు.