కేటీఆర్ పై ఎంపీ చామల కన్నెర్ర
NEWS Jan 01,2025 04:51 am
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి కేటీఆర్ కు అంత సీన్ లేదన్నారు. తమ పార్టీ, ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సీఎంపై ఇంకోసారి నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత 10 ఏళ్ల పాలనా కాలంలో ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ పేరు చెప్పి నిట్ట నిలువునా దోచుకున్నారంటూ ఆరోపించారు.