నితీశ్ కుమార్ రెడ్డికి సన్నీ కంగ్రాట్స్
NEWS Jan 01,2025 04:24 am
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో నితీశ్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబు ఇచ్చాడు. 4వ టెస్టు మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేయడం తనను మరింతగా ఆకట్టుకుందని తెలిపారు. భవిష్యత్తులో బెస్ట్ ఆల్ రౌండర్ గా ఎదుగుతాడని జోష్యం చెప్పారు.