చంద్రబాబు రూ. 931 కోట్లు ఎక్కడివి..?
NEWS Jan 01,2025 03:53 am
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివ శంకర్ రెడ్డి. దేశంలో కెల్లా అత్యంత సంపన్నమైన సీఎంగా రూ. 931 కోట్లతో నిలవడంపై స్పందించారు. ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ఏం కష్టం చేస్తే ఇన్ని ఆస్తులు పోగేసుకున్నారో జనం నేర్చుకుంటున్నారని పేర్కొన్నారు .