4న తెలంగాణ కేబినెట్ సమావేశం
NEWS Jan 01,2025 03:28 am
తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం 4వ తేదీన జరగనుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై చర్చిస్తారు. భూమిలేని నిరుపేద రైతులకు ఏడాదికి రూ.12 వేల సాయంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదికపై కూడా చర్చకు రానుందని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.