రేవంత్ రెడ్డి ఆస్తులు రూ. 30 కోట్లు
NEWS Dec 31,2024 04:31 pm
దేశంలోనే అత్యంత సంపన్నమైన సీఎంల జాబితాను ప్రకటించింది ఏడీఆర్ సంస్థ. మొత్తం 31 మంది సీఎంల ఆస్తుల వివరాలను వెల్లడించింది. తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయా సీఎంలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. తొలి స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉండగా 7వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అత్యంత పేద సీఎంగా మమతా బెనర్జీ నిలిచారు.