Logo
Download our app
గతేఎడాది కంటే పెరిగిన నేరాలు
NEWS   Dec 31,2024 01:57 pm
కామారెడ్డి జిల్లాలో గతేడాది కన్నా ఈసారి నేరాల సంఖ్య పెరిగింది. కామారెడ్డి జిల్లాలో ఏడాది వ్యవధిలో నమోదైన కేసుల వివరాలను ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు. 2023లో జిల్లావ్యాప్తంగా మొత్తం 5,578 కేసులు నమోదు కాగా, ఈసారి 6,006 కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. ఇందులో 708 ఆస్తి సంబంధిత నేరాలు, 38 హత్యలు, 35 కిడ్నాప్‌లు, 60 అత్యాచారాలు, 513 రోడ్డు ప్రమాద కేసులు, 1,441 ఇతర కేసులు, 561 స్పెషల్‌ లోకల్‌ చట్టాలు కేసులుగా, 535 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయని వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source