తొలి అద్దాల వంతెన ప్రారంభం
NEWS Dec 31,2024 06:50 am
దేశంలోనే తొలిసారిగా తమిళనాడు లోని కన్యాకుమారి లో నిర్మించిన ఫైబర్ గ్లాస్ వంతెనను ప్రారంభించారు సీఎం ఎంకే స్టాలిన్. దీనిని రూ. 37 కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వంతెన పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. 133 అడుగుల తిరువళ్లువర్ విగ్రహం, వివేకానంద స్మారక మండపం కలిపేలా దీనిని ఏర్పాటు చేశారు. 2000లో దివంగత సీఎం కరుణానిధి హయాంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.