Logo
Download our app
వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సిఐ
NEWS   Dec 31,2024 05:57 am
కోరుట్ల: న్యూఇయ‌ర్ వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు సూచించారు. 31న రాత్రి డ్రింక్ చేసి రోడ్లపై తిరగకూడదని, వేగంగా వాహనాలు నడ‌ప‌కూడ‌ద‌ని సూచించారు. పట్టణంలో పెట్రోలింగ్, గ్లూకోట్ టీం తిరుగుతూనే ఉంటాయని, డీజేలకు పర్మిషన్ లేద‌న్నారు. ఓపెన్ ప్లేస్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరపవ‌ద్ద‌ని, రోడ్లపై కేక్ కటింగ్, స్ట్రీట్ లైట్లు పగలగొట్టడం లాంటిది చేయకూడదన్నారు. పట్టణంలోని రౌడీషీటర్లకు ముందుగానే కౌన్సెలింగ్ చేశామని ,మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయన్నారు.
⚠️ You are not allowed to copy content or view source