మురళీకృష్ణ దేవాలయంలో పుష్పాభిషేకం
NEWS Dec 31,2024 05:52 am
మెట్‌పల్లి: అంగరంగ వైభవంగా మురళీకృష్ణ దేవాలయంలో పుష్పాభిషేకం మెట్‌పల్లి పట్టణంలోని మురళీకృష్ణ దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పుష్పాభిషేక కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు మైలారపు లింబాద్రి, లక్ష్మీ దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.