Logo
Download our app
డిసెంబర్‌ 31న నిబంధనలు పాటించాలి
NEWS   Dec 30,2024 05:59 pm
కామారెడ్డి జిల్లా పరిధిలో డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి వేడుకల్లో ప్రజలు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సింధూశర్మ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నగరంలో తనిఖీల కోసం ప్రత్యేకంగా 20 టీంలు ఏర్పాటు చేశామన్నారు. 31న అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమతించిన సమయం మేరకే బార్లు, మద్యం షాపులు తెరిచి ఉంచాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source