తెలంగాణలో క్రైం రేట్ పెరిగింది: కవిత
NEWS Dec 30,2024 05:58 pm
తెలంగాణ రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగింది.. శిక్షలు తగ్గాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. క్రైం రేటు 10 శాతం పెరిగిందన్నారు. పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడం తప్ప ఏమీ చేయడం లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో ఇంత పెద్ద నాయకులు ఉండి ఏం లాభమని.. బీజేపీ ఎమ్మెల్యేలను పని చేయనీయడం లేదని ఫైర్ అయ్యారు. ఇవాళ(సోమవారం) నిజామాబాద్‌లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు.