రేవతి మృతి బాధాకరం
NEWS Dec 30,2024 12:45 pm
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి స్పందించారు. ఈ ఘటనలో రేవతి మృతి చెందడం బాధాకరమన్నారు. సినిమా చూసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవడం తనను మరింత కలిచి వేసిందన్నారు. మృతి చెందిన వెంటనే ఎవరైనా వెళ్లి పరామర్శించి ఉంటే బావుండేదన్నారు. అల్లు అర్జునే కాదు ఇంకా ఎవరైనా ఎందుకు వెళ్ల లేదంటూ ప్రశ్నించారు.