పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్
NEWS Dec 30,2024 12:30 pm
రేషన్ స్కాం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి బిగ్ రిలీఫ్ దక్కింది. పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కృష్ణా జిల్లా కోర్టు. గోడౌన్ లో 4 వేల టన్నులకు పైగా ప్రజలకు చెందిన రేషన్ బియ్యం మాయమైందని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టును ఆశ్రయించారు నాని.