ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యేలను గెలిపిస్తా
NEWS Dec 30,2024 12:10 pm
బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ హైకమాండ్ కు కీలక సూచన చేశారు. తనకు అవకాశం ఇస్తే మూడు జిల్లాల్లో 18 ఎమ్మెల్యేలను దగ్గరుండి గెలిపిస్తానని లేక పోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు తనకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే.