నాకు ఎవరూ శుభాకాంక్షలు చెప్పొద్దు
NEWS Dec 30,2024 09:49 am
నూతన సంవత్సరం సందర్బంగా తనకు ఎవరూ శుభాకాంక్షలు తెలియ చేయొద్దంటూ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు సంతాప సూచకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. దీనిని గమనించి సహకరించాలని కోరారు. కాగా కేంద్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జనవరి 1 వరకు సంతాప దినాలు ప్రకటించాయి.